‘వాల్తేరు వీరయ్య’లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ చిత్రం వచ్చేనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ – పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
మణిశర్మ కుమారుడు మహతి సాగర్ ఈ రేంజ్ మ్యూజిక్ అందిస్తాడని అభిమానులు అంచనా వేయలేకపోయారు. అంతకుముందు ఈ చిత్రంపై రీమేక్ అనే కారణంతో అభిమానులు చాలా తక్కువ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడైతే టీజర్, పాటలు రిలీజ్ అయ్యాయో ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.
ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళమ్ చిత్రానికి రీమేక్. వేదాళంలో అజిత్ హీరోగా నటించాడు. ఈ సినిమా తమిళ్లో హిట్ అవ్వగానే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ పాత్ర నాకు సెట్ కాదని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ సినిమా రీమేక్ రైట్స్ నిర్మాత అనిల్ సుంకర కొనుగోలు చేసి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమా గురించి ప్రేక్షకులకు కంగారు ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ హిస్టరీ అలాంటిది మరి. ఈయన దర్శకత్వం వహించిన సినిమాల్లో బిల్లా మినహా మిగిలివన్నీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే పవన్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో ఈ సినిమా రీమేక్ నుంచి తప్పుకుని మంచి పనిచేశాడని రిలాక్స్‌గా ఉన్నారు.