బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఆ 2 సినిమాల్లో ప‌వ‌న్ న‌టించార‌ని తెలుసా…ఆ సినిమాలు ఇవే..!

చిత్ర పరిశ్రమలో ఓ హీరో రిజెక్ట్ చేసిన సినిమాతో మరో హీరో సినిమా చేసి హిట్ లేదా ప్లాస్ కొట్టడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓ హీరో వదులుకున్న సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టాడు. ముందు ఆ సినిమాని వదులుకున్న హీరో అర్రే మంచి సినిమా వదులుకున్నామే అని ఫీల్ అవుతూ ఉంటారు. అదే ప్లాప్ అయితే నా జ‌డ్జ్‌మెంట్ క‌రెక్ట్ అనుకుంటూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ చేయాల్సిన ఓ సినిమా ఆయ‌న మిస్ అవ్వ‌డంతో అది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సి వ‌చ్చింది. ఆ మాట‌కు వ‌స్తే ప‌వ‌న్ చేయాల్సిన ఎన్నో సినిమాలు ఆయ‌న వ‌దులు కోవ‌డంతో అవి వేరే హీరోలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టారు. మ‌హేష్ బాబు పోకిరి క‌థ పూరీ జ‌గ‌న్నాథ్ ముందుగా ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కే తీసుకు వచ్చాడు. రవితేజకు హీరోగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఇడియట్ – అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు కూడా ప‌వ‌న్ వ‌దులుకున్నాకే ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో వ‌చ్చిన సినిమా అన్న‌వ‌రం. సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన‌ ఈ సినిమాకు భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆశిన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప‌వ‌న్ చెల్లి పాత్ర‌లో ప్రేమిస్తే సంధ్య‌, బావ‌గా శివ‌బాలాజీ న‌టించారు. ఈ సినిమాలో సిస్ట‌ర్ సెంటిమెంట్ ఉండ‌డంతో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఈ క‌థ బాల‌య్య‌కు బాగా సెట్ అవుతుంద‌ని భావించారు.

ముద్దుల మావ‌య్య త‌ర్వాత బాల‌య్య సిస్ట‌ర్ సెంటిమెంట్ ఉన్న సినిమా చేయ‌లేద‌ని.. ఇది ఆయ‌న‌కు బాగా న‌ప్పుతుంద‌ని అనుకున్నార‌ట‌. అయితే త‌ర్వాత ఈ క‌థ అటూ ఇటూ తిరిగి ప‌వ‌న్ వ‌ద్ద‌కు చేర‌డంతో ఆయ‌న న‌టించారు. అయితే భారీ అంచ‌నాల మ‌ధ్య 2007 చివ‌ర్లో వ‌చ్చిన అన్న‌వ‌రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అదే టైంలో ఎన్టీఆర్ న‌టించిన రాఖీ సైతం చెల్లి సెంటిమెంట్‌తోనే వ‌చ్చి అది కూడా యావ‌రేజ్ అయ్యింది.

అదే విధంగా పవన్ కళ్యాణ్- రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా ముందుగా బాలకృష్ణ దగ్గరికి వచ్చిందట. ఆయన ఈ కథ పవన్ కళ్యాణ్ కి సూట్ అవుతుందని చెప్పడంతో దర్శకనిర్మాతలు ఈ సినిమాను పవన్‌తో చేసి సూపర్ హిట్ కొట్టారు. ఈ విధంగా బాలయ్య రిజెక్ట్ చేసిన‌ సినిమాలు పవన్ కళ్యాణ్ చేశాడు.