సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక ఫేవరేట్ హీరోయిన్ ఉంటారు. కొంత మంది ఓపెన్ గా చెప్పేతే మరికొందరు బయటికి చెప్పుకోరు. ఇప్పటి హీరోలు ఎదో ఇంటర్వ్యూలో, ప్రమోషన్స్ లో, షోస్ లో చెబుతూనే ఉంటారు. ఇంకా కొన్ని షోస్ లో యాంకర్లు అడిగే ప్రశ్నలకి కూడా సమాధానం చెబుతారు. ఏ హీరోయిన్ పై క్రష్ ఉందని, ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్లాలని ఉండనే ప్రశ్నలకి కూడా సమాదానాలు చెబుతుంటారు. అయితే కొందరి హీరోస్ కి ఏ హీరోయిన్ అంటే ఎక్కవ ఇష్టమో తెలుసుకునేందుకు మాత్రం అందరు ఎదురుచూస్తుంటారు.
అలంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.
ఏ హీరో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన ఫేవరేట్ హీరో అని చెబుతుంటారు. హైపర్ ఆది, నితిన్ అయితే పవన్ కళ్యాణ్ పేరు లేకుండా వారి స్పీచెస్ ని ముగించరు. అంతలా సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలనీ హీరోయిన్లు అనుకుంటుంటారు.
అయితే మరి పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలని మాత్రం అందరికి ఉంటుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ తన ఫేవరేట్ హీరోయిన్ పేరు కూడా చెప్పారు.
ఆమె ఎవరో కాదు. మహానటి సావిత్రి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అలనాటి నటి సావిత్రి.. నా ఫేవరెట్ హీరోయిన్. ఆమె సినిమాలన్నా, నటన అన్నా నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు.
ఒక నటిగా కంటే.. ఓ వ్యక్తిగా తనను ఆమెను ఎక్కువ ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో అందరికి తెలిసిపోయింది. సావిత్రి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
సావిత్రికి కూడా సేవా గుణం ఎక్కువే అని అందరికి తెలిసిందే. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెంటనే సావిత్రి వారికి సహాయం చేయడంలో ముందుంటుంది. డబ్బులు లేకున్నా తన దగ్గర ఉన్న చీర అమ్మి సాటి మనిషికి సహాయం చేస్తారని ఇప్పటికి చెబుతుంటారు. సాయం అడిగితే తీర్చికుండా వారిని సావిత్రి వెనిక్కి పంపించరు.
సినీ ఇండస్ట్రీలో సావిత్రిని ఎవ్వరు, ఎప్పటికి మర్చిపోరు. ఎన్నో హిట్ సినిమాల్లో సావిత్రి నటించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.