పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు.. ఇటు సినిమాలతో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ ముగించుకుని ఓజి సినిమా షూటింగ్ కూడా చివరి దశకు తీసుకొచ్చారు. ఇలా వరుస సినిమా షూటింగుల్లో కొనసాగుతూనే వారాహి యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే పవన్ ను సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి అకౌంట్లో కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఇక ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అడుగుపెట్టాడు. పవన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పెద్దగా ఇవ్వకపోయినా.. రాజకీయాలకు సంబంధించి తన పార్టీకి అవసరమైన విషయాలను తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు.
సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వడం అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.
పవన్ కళ్యాణ్ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేశాడు అనే వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఆయనను ఫాలో అవటం మొదలుపెట్టేశారు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ ఫాలోవర్స్‌ను తెచ్చుకోవడం కోసం చాలామంది సెలబ్రిటీలు ఎంతో సమయం తీసుకునేవారు. వారీలో మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకోవడం కోసం ఏకంగా నెలల సమయం తీసుకున్నారు.
అలాంటిది పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన కేవలం 6 గంటల్లోనే వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇక పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు, ఇక ఎవరినీ కూడా ఫాలో అవడం లేదు. ఆయన ఎవరిని ఫాలో అవుతారు, మొదటి పోస్ట్ ఏం ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే పవన్.. ఇన్‌స్టాగ్రామ్‌ని ఓ ప్లానింగ్ ప్రకారం వాడబోతున్నారట. అది సంచలనాలకు తెరలేపేలా ఉండబోతుందని తెలుస్తుంది.