టాలీవుడ్‌లో అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అయన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి అన్నను మించిన తమ్ముడుగా ఎదిగాడు. తనకంటూ సెపరేట్ అభిమానులను క్రియేట్ చేసుకుని ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి ఈ స్టార్ హీరోని ఆయన అభిమానులు పవర్ స్టార్ అంటూ ఎంతో ముద్దుగా పిలుస్తూ ఆరాధిస్తారు.
ఇక అసలు పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది.. ఎవరు ఇచ్చారు.. అనే విషయం చాలామందికి తెలియదు. ఇక ఇప్పుడు పవన్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమా యావరేజ్ గా నిలిచిన పవన్ రెండో సినిమా గోకులంలో సీత బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఆ సినిమాను సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించగా ఇందులో పవన్ కు జంటగా రాశి హీరోయిన్‌గా నటించింది. 1997లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షంం కురిపించింది. ఇక ఈ సినిమాకు రచయిత సీనియర్ నటుడు, రాజకీయ నేత పోసాని కృష్ణమురళి మాటలు అందించారు.
ఆ సమయంలోనే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రచయిత పోసాని కృష్ణమురళి తొలిసారిగా మీడియా ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని సంబోధించాడు. ఇక తర్వాత చాలా న్యూస్ పేపర్లో పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదుతో ఎన్నో వార్తలు రాసుకు వచ్చాయి. అలా పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారాడు. ఇక కాగా ప్రస్తుతం పవన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఓ జి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈనెల చివరిలో బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.