జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సోషల్ మీడియాలో ఏపీలో ఉన్న వలంటీర్ల గురించి చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు వలంటీర్లపై పవన్ ఆరోపణలు చేయటం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది అంటూ పవన్ మరోసారి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ విధానాల విషయంలోనే తనకు కోపం ఉందని పవన్ పేర్కొన్నారు. ఇక అమ్మాయిల అదృశ్యం గురించి చెప్పటానికి వైసీపీ నేతలు ఎందుకు ? ఇష్టపడటం లేదని కూడా పవన్ ప్రశ్నించారు. వైసిపి నేతలు చేస్తున్న కామెంట్లకు నా భార్య కూడా ఏడుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పవన్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వైసిపి ప్రభుత్వంపై.. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ వాళ్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంతో పాటు పవన్ పెళ్లిళ్ల గురించి పదేపదే కామెంట్లు చేయటం ఎంతవరకు ?కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
చివరకు ఇంట్లో వాళ్ళు బాధపడేలా కూడా వైసిపి నేతలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారని.. వైసీపీ వాళ్లకు ఇంట్లో అమ్మలు, అక్కలు లేరా అన్న ప్రశ్నలు కూడా జనసేన వర్గాల నుంచి వస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ నేతల మాటలు చివరకు పవన్ భార్యకు కూడా ఎంతో ? ఆవేదన కలిగించినట్టు పవన్ మాటలే చెబుతున్నాయి.