పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ , మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తోన్న సినిమా బ్రో. కోలీవుడ్ లో వినదోయ సితం పేరుతో తెరకెక్కి హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో పవన్, సాయి కాంబోలో బ్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకుడు. పేరుకు మాత్రమే సముద్రఖని దర్శకత్వం వహించినా తెరవెనక కథ, స్క్రీన్ ప్లే, మాటలు అంతా తానై నడిపించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్?
ఇక తాజాగా మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా టోటల్ రన్ టైం రెండు గంటల 16 నిమిషాల నిడివి వచ్చిందని తెలిసింది. ఇందులొ స్టార్టింగ్, ఎండింగ్ టైటిల్స్ కట్ చేస్తే మిగిలిన రన్ టైం 2 గంటల 10 నిమిషాల వరకు వుంటుంది. అంటే మొత్తంగా 130 నిమిషాల పాటు సినిమా రన్ అవుతుంది. ఇది కరెక్ట్ రన్ టైన్ అనే చెప్పుకోవాలి. సినిమాకు ఎటువంటి కట్స్ లేకుండా యు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఫ్యామిలీలతో సహా వెళ్లి మరీ థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమా అనుకోవాలి.
ఇక పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తరవాత పవన్ వరుసగా చేస్తున్న మూడో రీమేక్ సినిమా బ్రో కావడం విశేషం. అయితే తమిళ సినిమా లైన్ తీసుకుని, కథ మొత్తం మార్చి కొత్త సీన్లతో.. చాలా సరికొత్తగా తయారు చేశారట త్రివిక్రమ్. పవన్ ఫ్యాన్స్ కు ఎలా కావాలో అలాంటి ఫుల్ మీల్స్ అంశాలతో ఫస్టాఫ్ తీర్చిదిద్దారట. ఫస్టాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనర్ అంటున్నారు.
ఇక సెకండాఫ్ అయితే పూర్తిగా కథ మీద రన్ అవుతుందట. ఓవరాల్‌గా సినిమా అయితే పవన్, మెగాభిమానులకు బాగా నచ్చుతుందని.. మిగిలిన ఆడియెన్స్‌ను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందన్న దానిమీదే సినిమా రేంజ్ ఆధారపడి ఉంటుందని చెపుతున్నారు. పీపుల్స్ మీడియా సంస్థ, జి స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.