మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు మాస్ మహారాజా రవితేజ. రవితేజ ముందుగా చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన సినిమాలను వదలకుండా నటించి ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో స్టార్ హీరోగా నిలిచాడు. అయితే ఇప్పుడు రవితేజ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వార్త ఏమిటంటే రవితేజ ఇంత పెద్ద స్టార్ హీరోగా మారడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని.. పవన్ వల్లే రవితేజ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే రవితేజను స్టార్ హీరోగా చేసిన సినిమాల్లో ముఖ్యంగా ఇడియట్, విక్రమార్కుడు సినిమాలు కూడా ఉంటాయి. ఈ సినిమాలకు ముందు రవితేజ యావరేజ్ హీరోగా ఉన్న ఒక్కసారిగా ఈ సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు.
ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 2006లో రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమాతో మరో బంపర్ హిట్ అందుకొని మాస్ మహారాజా గా మారాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లో కూడా ముందుగా రవితేజను హీరోగా అనుకోలేదట.
ఇడియట్ సినిమా కథను ముందుగా పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడట. ఆయన నో చెప్పడంతో అదే కథతో రవితేజతో సినిమా చేశాడు. రాజమౌళి కూడా ఈ విక్రమార్కుడు కథని ముందుగా పవన్ కళ్యాణ్ కు చెప్పగా ఆయనకు కథ నచ్చిన డేట్లు ఎడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆ సినిమాను వదులుకున్నాడు. అలా ఈ సినిమా కూడా రవితేజ చేతులోకి వచ్చింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేసిన హెల్ప్ కారణంగానే రవితేజ ఇప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా నిలిచాడు.