టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్.. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నిధి తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నిధి అగర్వాల్‌కి వరస ఛాన్సులు క్యూ కట్టాయి. కాని అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా ఆమె పరిస్థితి తయారైంది. వరుస ఛాన్స్ లను దక్కించుకున్నా సినిమాలు వాయిదా పడడంతో నిధి పరిస్థితి కూడా పై సామెతలా మారింది. ఆమె నటిస్తోన్న సినిమాల షూటింగ్‌లు ఎప్పుడు తిరిగి మొదలవుతాయో తెలియని పరిస్థితి.
పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. ప్రభాస్ – మారుతి సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌నే అనుకున్నారట. ఈ సినిమా కూడా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశంలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
సలార్ తర్వాత ప్రాజెక్ట్ కే సినిమా లైన్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని అయ్యేలోపు నిధిని హీరోయిన్‌గా మార్చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాల్లో ఎవరి సినిమా అయినా రిలీజైతే నిధి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొని మరిన్ని ఛాన్సులు అందుకునే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాలు ఎప్పుడు ? రిలీజ్ అవుతాయో తెలియక చాలా ఇబ్బంది పడుతుందట నిధి.