ప‌వ‌న్ క‌ళ్యాణ్ – విజ‌య్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ… డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌…!

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , విజయ్ దళపతికి ఓ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లు వచ్చినా పవర్ స్టార్‌ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలానే తమిళ్‌లో విజయ్‌కి కూడా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విజ‌య్ ఎన్నో ట్రోల్స్ ఫేస్ చేసినప్పటికీ స్టార్ హీరోగా వరుస అవకాశాలతో సినిమాల్లో కొనసాగుతున్నాడు.

ఈ ఇద్ద‌రు హీరోల సినిమాల‌కు పాజిటివ్ టాక్‌ వస్తే కొత్త రికార్డులను సృష్టిస్తాయి. ఈ ఇద్ద‌రి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్‌కి మొదటి రోజు థియేట‌ర్ల‌లో పండగలాగా ఉంటుంది. వీరిద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. చాలా సార్లు మీ ఫేవరెట్ హీరో ఎవరు ? అని విజయ్‌ని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. అలా ఇంత క్రేజ్ ఉన్న ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే.

అలాంటిది ఆ కాంబినేషన్లో ఒక సినిమా మిస్ అయింది . ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కావడంతో గతంలో ఎస్ జె సూర్య వీరితో ఒక సినిమాను తీయాలనుకున్నాడట. ఆ సినిమాకి వీరిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. తరువాత ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ తో కొమరంపులి సినిమా తీశాడు. ఖుషి త‌ర్వాత వీరి కాంబినేష‌న్లో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన పులికి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వ‌చ్చి ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సినిమాలకు దర్శకత్వం చేయడం మానేశాడు సూర్య.

దీంతో పవన్ కళ్యాణ్ – విజయ్ కాంబినేషన్లో రావాల్సిన సినిమాకు బ్రేక్ పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, విజయ ఇద్దరు ఎవరి ? సినిమాల్లో వారు బిజీగా గడపడంతో మళ్ళీ ఆ కాంబినేషన్లో సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు. విజయ్ కూడా ఓ పక్కన వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.

త్వరలోనే విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విజ‌య్‌ మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే పూర్తిగా సినిమాలు ఆపేస్తాను అంటూ విజయ్ కామెంట్ చేశాడు. కాబట్టి ఈ కాంబినేషన్‌లో ఇకపై సినిమాలు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.