తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ గురించి ఎన్నిసార్లు ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ లో చిరంజీవితో మొదలైన ఈ కుటుంబం హవా ప్రస్తుతం టాలీవుడ్ లోనే అత్యధిక హీరోలు ఉన్న కుటుంబాలలో మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటుంది. ఎంతమంది హీరోలు వచ్చినా ఈ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎవరూ కలిసి సరైన మల్టీ స్టార్ సినిమా చేయలేదు.
ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలు ఎప్పుడూ కలిసి ఒకే సినిమాలో హీరోలుగా తెరపై కనిపించింది లేదు. చిరంజీవి మాత్రం తన కొడుకు రామ్ చరణ్‌తో కలిసి ఆచార్య సినిమాలో కలిసి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. గతంలో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్న రోల్ చేశాడు.
రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో అల్లు అర్జున్ కూడా కీ రోల్ పోషించాడు తప్ప అందరూ హీరోలు కలిసి నటించిన సినిమా మాత్రం లేదు. గతంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ క్రేజీ మల్టీ స్టార్ చేయాలని ప్లాన్ చేశాడట. ఆ సినిమా కూడా ఎఫ్2, ఎఫ్3 సినిమాల తరహాలో కామెడీ ఫ్రాంచైజీ తరహాలో తెరకెక్కించాలని భావించారట. ఈ సినిమాకు దర్శకుడుగా అనిల్ రావిపూడిని ఎంచుకున్నారు.
ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో వాయిదా పడుతూ వచ్చింది. మళ్లీ పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక ఈ సినిమా చేయాలని భావించారు. కానీ అల్లు అర్జున్ డేట్స్ ఖాళీ లేక పవన్ వకీల్ సాబ్ సినిమా చేసాడు. మరి రాబోయే రోజుల్లో ఆయన ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని మెగా అభిమానులు ఆశపడుతున్నారు. ఒకవేళ అన్నీ కుదిరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.