స్ట్రైట్ స్టోరీల కంటే రీమేక్ సినిమాలు తోనే భారీ విజయాలు సాధించవచ్చు. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు. ఇతర ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను మన ప్రేక్షకులకు అనుగుణంగా మలిచి తెరకెక్కిస్తే వాటితో హిట్టు కొట్టడం చాలా ఈజీ. మన టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేసి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో 30కు పైగా సినిమాల్లో నటిస్తే అందులో 11 సినిమాలు రీమేక్‌లే అవ్వటం విశేషం. అందులో ఏడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. పవన్ కళ్యాణ్ నటించిన రీమిక్ సినిమాలు ఎంటో ఒకసారి చూద్దాం.
గోకులంలో సీత:
ఇది తమిళ్ ‘గోకులతిల్ సీతై’ కు రీమేక్. పవన్ కళ్యాణ్, రాశీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. సుస్వాగతం: ఇది తమిళ్ ‘లవ్ టుడే’ సినిమాకు రిమేక్ . పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు.
ఖుషి:
ఎస్.జె.సూర్య తమిళంలో తీసిన ‘ఖుషి’ నే తెలుగులో అదే టైటిల్ తో రిమేక్ చేశాడు. భూమిక ఈ సినిమాలో హీరోయిన్.
అన్నవరం: తమిళ్ ‘తిరుపచి’ చిత్రానికి రీమేక్ ఇది. పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన ఈ సినిమాను భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేసారు.
గబ్బర్ సింగ్: బాలీవుడ్‌లో సల్మాన్ నటించిన దబాంగ్ మూవీకి ఇది రిమేక్.పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
గోపాల గోపాల:
బాలీవుడ్ మూవీ ‘ఓ మై గాడ్’ కు ఇది రీమేక్.పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించాడు.ఈ మూవీ కూడా విజయం సాధించింది.
కాటమరాయుడు: అజిత్ హీరోగా తమిళంలో తెరెక్కిన ‘వీరం’ సినిమాకు రిమేక్ ఇది.పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన ఈ మూవీకి డాలీ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా కూడా యవరేజ్ గా నిలిచింది.
వకీల్ సాబ్ :
బాలీవుడ్‌లో అమితాబ్, తాప్సి నటించిన ‘పింక్’ చిత్రానికి ఈ మూవీ రీమేక్.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.
బ్రో:
ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో బ్రో సినిమా కూడా కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన వినోదయ సైతంకు రీమేక్ గా వస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ తన కెరీర్లో రీమిక్ సినిమాలతోనే భారీ విజయాలు అందుకున్నాడు.