వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య‌ ఎంగేజ్మెంట్‌కు పీక‌ల‌దాకా తాగి వ‌చ్చిన ప‌వ‌న్‌…

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం అటు సినిమాల‌తో పాటు ఇటు రాజ‌కీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో క‌లిసి చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా బ్రోతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా, సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాల‌లో న‌టిస్తున్నాడు.

ఇక ప‌వ‌న్ తాజాగా త‌న అన్న కొడుకు హీరో వ‌రుణ్‌తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌కు వ‌చ్చాడు. ప‌వ‌న్ ట‌క్ చేసుకుని చాలా స్టైలీష్‌గా ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి అక్షింత‌లు వేసి కాబోయే దంప‌తుల‌ను దీవించి మ‌రీ వెళ్లాడు. ప‌వ‌న్ ఈ వేడ‌క‌కు రావ‌డం మెగాభిమానుల్లో స‌రికొత్త జోష్ నింపింది. సాధార‌ణంగా మెగా ఫ్యామిలీలో జ‌రిగే వేడుక‌ల‌కు ప‌వ‌న్ పెద్ద‌గా అటెండ్ కాడు.

అయితే ప‌వ‌న్ ఈ వేడుక‌కు హాజ‌రు కావ‌డంపై త‌న‌కు తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు సంచ‌ల‌న ట్వీట్ చేసి పెద్ద దుమారం రేపాడు. ప‌వ‌న్ ఈ ఎంగేజ్మెంట్‌కు ఫుల్లుగా డ్రింక్ చేసి వ‌చ్చాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప‌వ‌న్ డ్రంక్ & డ్ర‌గ్గీ ముఖం చూస్తున్నాను.. అత‌డి సిబ్బంది చెప్పిన మాట‌ల ప్ర‌కారం అత‌డు ఇప్పుడు స్పృహ‌లో లేడు… షూటింగ్‌ల‌లో కూడా తాగి అల్ల‌రి అల్ల‌రి చేస్తున్నాడు అని మెసేజ్ పెట్టాడు.

Pawan Kalyan Attends Varun Tej and Lavanya Tripathi's Engagement - Gold Andhra

పైగా ఈ మెసేజ్‌కు తోడు ప‌వ‌న్ ఫొటో కూడా యాడ్ చేశాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఉమైర్ సంధుపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేయ‌డంతో పాటు దారుణంగా బూతుల‌తో తిడుతున్నారు.