ప‌వ‌న్ బ్రో సినిమాను ఈ అవుట్ డేటెడ్ ఐడియాతో లేపుతారా.. క్యామెడీ…!

హతవిధీ… పవర్ స్టార్ సినిమాకు ఇలాంటి మాట వినాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? టాలీవుడ్ లో అత్యంత ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరో, డైహార్ట్ ఫాన్స్ కూడా ఉన్నారు. వాళ్లే పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ కూడా బలం. కాబోయే సీఎం అని తెగ హడావిడి చేస్తున్నారు. అలాంటి స్టార్ హీరో మూవీ డిజాస్టర్ అనే టాక్‌ కూడా వచ్చింది. సినిమా బాగోకపోయినా పవన్ కళ్యాణ్ అభిమానుల మాత్రం తమ హీరో సినిమా హిట్ అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు.

ఎంత ప్రయత్నం చేసినా కూడా సినిమాలో స్టోరీ లేకుండా ఏం హిట్ అవుతుంది. సక్సెస్ టూర్ లు రెండు రకాలు. సినిమా సక్సెస్ అయిన తర్వాత‌ చేసేవి. సినిమా సక్సెస్ కోసం చేసేవి. సినిమా యావరేజ్ అనుకున్నా అంతగా లేదనుకున్నా సక్సెస్ టూర్ లు చేస్తారు. సినిమాని లేపే ప్రయత్నం చేస్తారు. చిన్న సినిమా పెద్ద సక్సెస్ అయినా చేస్తూ ఉంటారు.

సామజవరగమన సినిమా కూడా అలాంటిదే. కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో చిత్రాలకు థియేటర్ టూర్ లు చెయ్యరు. అలా చేస్తే చాలా చీప్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు బ్రో సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మంగళవారం నుంచి సక్సెస్ టూర్ పేరుతో థియేటర్స్ కి వెళితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారట. విడుదలకు ముందు ఆలయాల పేరుతో చాలా టూర్ లే తిరిగారు.

కానీ సినిమాలో కంటెంట్ లేకుండా దేవుడు మాత్రం ఏం చేస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. పవన్ లాంటి స్టార్ హీరోకు ఇంత గతి పట్టిందంటూ అభిమానులు బాధపడుతున్నారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ చెప్పేది ఏమిటంటే అయితే థియేటర్ టూర్, లేదంటే కాలేజ్ టూర్ చెయ్యమని సలహా ఇస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని గతంలో కొన్ని సినిమాలు కూడా నిరూపించాయి.