వామ్మో.. ప్రభాస్ ఎఫైర్ల‌ లిస్ట్ కూడా మామూలుగా లేదే… ఇంత‌మంది హీరోయిన్ల‌తోనా…!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు కాస్త చనువుగా కనిపించారంటే చాలు వారిద్దరి మధ్య లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అలాంటి ఎన్నో రూమర్స్ ఎదుర్కొన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా ఎఫైర్ నడిపాడు అంటూ ఒక లిస్టు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్ అనుష్క :
ప్రభాస్ – అనుష్క జోడీ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫీలైన అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఇక వీరిద్దరి పరిచయం పెళ్లి పీటల వరకు దారి తీసింది అని గుసగుసలు కూడా వినిపించాయి. అయితే వీరు మాత్రం అన్ని విషయాలలోనూ కలిసి ఉంటారు. కానీ పెళ్లి అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ప్రభాస్ – పూజా హెగ్డే:
రాధే శ్యామ్ సినిమా విడుదలకు ముందే ఈ ప్రచారం జోరుగా సాగింది. ప్రచార కార్యక్రమాలలో పూజా తక్కువగా కనిపించారు. వాస్తవానికి అంతకుముందు ఇద్దరి మధ్య ఏదో జరిగిందని .. అందుకే ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదని కామెంట్లు చేశారు. ముఖ్యంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు వినిపించాయి.. కానీ ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు.. ఎవరు నో చెప్పారు.. అనేది మాత్రం బయటకు రాలేదు.

ప్రభాస్ – కాజల్ అగర్వాల్, ఇలియానా:
ప్రభాస్ , కాజల్ అగర్వాల్ తో మొదట్లో ప్రేమలో ఉన్నారన్న పుకార్లు వినిపించాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల సమయంలో ప్రభాస్ కాజల్ ల ప్రేమాయణం జరిగింది అని.. ఆ సినిమా చేసేటప్పుడు ఏడాదిన్నర పాటు సీక్రెట్ గా డేటింగ్ చేసుకున్నారని సమాచారం.

మరొకవైపు మున్నా సినిమాలో ప్రభాస్ ఇలియానా జంటగా నటించగా వీరిద్దరి మధ్య కూడా ఏదో సంథింగ్ సంథింగ్ వుందని వార్తలు వినిపించాయి. కానీ ఎప్పుడూ కూడా ఆ విషయంపై స్పందించలేదు. మరొకవైపు కృతి సనన్ పేరు కూడా బాగానే వినిపించింది కానీ ఈ వార్తలలో నిజం లేదని ఆమె కొట్టిపారేసింది.