నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా తన స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోట్లాదిమంది ప్రేక్షకుల గుండెల్లో అన్నగారిగా చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే సినీ, రాజకీయ రంగాల్లో చరిత్రను సృష్టించారు. ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పరు అనే ఒక పేరు ఉండేది.
ఎన్టీఆర్ ఒక హీరోకి మాట ఇచ్చి కోరిక తీర్చకుండానే చనిపోయారట. ఇంతకీ ఎవరా హీరో..? ఏం మాటిచ్చారో..? తెలుసా..! గతంలో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలో నటించిన చంద్రమోహన్ చాలామంది స్టార్ హీరోయిన్లకి లక్కీ హీరో. చంద్రమోహన్ తో మొదటి సినిమా తీసిన చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో శ్రీదేవి, జయప్రద కూడా ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రమోహన్ కూడా కలిసి కొన్ని సినిమాల్లో నటించారు.
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రమోహన్ మీ సినిమాల్లో నాకు కీ రోల్ ఉండే ఒక పాత్రను ఇవ్వమని అడిగేవారట. ఎన్టీఆర్ కూడా నీకు నా సినిమాల్లో తప్పక కీ రోల్ ఇస్తానని మాటిచ్చారట. చాలా కాలం పాటు ఆయనకు ఆ అవకాశం రాలేదు. కొంతకాలానికి చంద్రమోహన్ తానే ఓ సినిమా తీస్తున్నానంటూ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి చెప్పాడట. అందులో మీరు హీరో, మీ తమ్ముడు పాత్రలో నేను చేస్తానని చెప్పడంతో ఎన్టీఆర్ ఆ సినిమాకు ఓకే కూడా చెప్పారు.
కానీ చంద్రమోహన్ సినిమా ఒప్పుకున్నాక కూడా ఆ సినిమా కంటే ముందే శ్రీనాథ్ కవి సార్వభౌమ సినిమాలో ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమా తర్వాత అయినా ఎన్టీఆర్ నా సినిమాలో నటిస్తారనుకున్న చంద్రమోహన్ కు ఆ కోరిక తీరలేదు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక.. ఆ వెంటనే మరణించారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్.. చంద్రమోహన్‌కి ఇచ్చిన మాట తప్పినట్టయింది.