నటరత్న ఎన్టీఆర్ మనవడిగా నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాలకే ఎవరు అందుకోలేని మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ చేసిన సింహాద్రి సినిమా సమయానికి అభిమానుల విషయంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అలాంటి స్టార్ స్టేటస్ అందుకున్న సమయనికి ఎన్టీఆర్ వయసు కేవలం 17 సంవత్సరాలు.
అలాంటి సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో వరుస ప్లాప్ సినిమాలు వచ్చాయి. ఇలా ఎన్టీఆర్ కెరీర్ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్ లో కూడా పూజా కార్యక్రమాలు జరుపుకొని ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ అరవింద సమేత అనే బ్లాక్ బస్టర్ సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ భావించారు.
అంతేకాకుండా ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఫైనల్ గా ఎన్టీఆర్‌కు ఆ కథ నచ్చకపోవడంతో ఆ సినిమాను అక్కడే వదిలేసాడు. అంతేకాకుండా గతంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున,కార్తీ కాంబినేషన్లో వచ్చిన ఊపిరి సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అనగా ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో బాహుబలి సినిమాలకన్నా ముందేే భారీ బడ్జెట్ తో గరుడ అనే సినిమా చేద్దామనుకున్నారు. అయితే ఈ సినిమా కూడా చర్చల దగ్గరే ఆగిపోయింది భవిష్యత్తులో అయినా ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళుతుందనే ఆశతో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ కెరీర్ లోనే ప్రారంభ దశలోని ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి.