ఎన్టీఆర్- ప్రశాంత్‌నీల్ సినిమా… ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చే న్యూస్‌..!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్ అందుకున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. ఇప్పటికే తన 30వ దేవరను కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ లోగా పూర్తి చేసి త‌ర్వాత మరో బిగ్గెస్ట్ మూవీ వార్ 2 సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు ఎన్టీఆర్ మూడు నెలలు కాల్ షీట్స్ ను ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ ప్రభాస్ తో సలార్‌ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా టీజర్ కూడా వచ్చి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతారట. ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందనిని తెలుస్తుంది. ప్రశాంత్‌ నీల్- ఎన్టీఆర్ సినిమాని కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయి సినిమా థియేటర్లోకి రావడానికి మరో ఆరు నెలలు టైం పడుతుంది.

ఈ లెక్క‌న‌ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్‌ సినిమా 2026 వరకు ప్రేక్షకులు ముందుకు రాదు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టైంలో మ‌రో మూడేళ్లు ఆగ‌డం అంటే కాస్త నిరాశ‌లాంటిదే. ఎన్టీఆర్ తో అదిరిపోయే సినిమాను తెరకెక్కిస్తాను అని ప్రశాంత్ నీల్ ఇదివరకే తెలిపారు. ఇప్పటికే కెజీఎఫ్ 2 భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరో పాన్ ఇండియా విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.