” కే జి ఎఫ్ ” సినిమా తరువాత ప్రభాస్ ” సల్లార్ ” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ” ఎన్టీఆర్ 31 ” వ సినిమా సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు నీల్. అయితే ఇది ఇప్పటి వరకు మనందరికి వినిపించిన.. కనిపించిన న్యూస్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ? ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు.
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా రెండు భాగాలుగా రీలిజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. సలార్ సినిమా రిలీజ్ అయిన 6 నెలల్లోనే రెండో పార్ట్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట సలార్ టీం. ఇప్పటికే ” సల్లార్ 2 ” కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తయ్యింది. దీంతో సలార్ సినిమా తర్వాత సలార్ 2 షూటింగ్లో బిజీగా ఉంటాడు ప్రశాంత్ నీల్.
ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ 31వ సినిమా షూటింగ్ ఇప్పట్లో ఉండదని.. సలార్ 2 షూటింగ్ పూర్తి అయిన ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం ” దేవర ” మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ ” వార్ 2 ” షూటింగ్ ఎన్టీఆర్ పూర్తి చేస్తాడు.
ఈ లెక్కన చూస్తుంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ఇంకెప్పుడు? సెట్స్ పైకి ఎక్కిస్తారు అన్న అనుమానాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జూన్, జూలైలో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే సూచనలు ఉన్నా అది నమ్మశక్యంగా అయితే లేదు. అసలు ఈ సినిమా అన్నీ అనుకున్నట్టు కదిరితే ఏ 2026లోనే ఈ సినిమా రిలీజ్ అయితే గొప్ప.. !