కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా చిత్రం ‘ దేవర ‘ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ మూడ్లో దేవర తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా భారీ సినిమాల మేకర్స్ ఫ్యాన్స్ ని రిలీజ్ డేట్ల విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.
మామూలుగా ఏ హీరో ఫ్యాన్స్ అయినా తమ అభిమాన హీరో సినిమాకు నెల రోజులు ఉంటే అప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు.. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం 250 రోజులకు ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ టీం దేవర సినిమా రిలీజ్ డేట్ మరో 250 రోజులు ఉందని చెప్పడంతో తారక్ అభిమానులు ఇప్పుడు నుంచే హడావిడి మొదలు పెట్టేసారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా యువసుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇది మొదట సినిమా కావడంతో అభిమానులకి మరింత ఎక్సైట్మెంట్ పెరిగింది. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానున్నది.