ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ టు పార్ట్స్ గా రిలీజ్ అవుతున్నాయి. మొదట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా టు పార్ట్స్‌గా రిలీజై పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీయఫ్ కూడా రెండు పార్టులుగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది.
ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా కూడా రెండు పార్టులుగా వస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమా మొదటి పార్ట్ పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లోనే కాక సౌత్ ఇండస్ట్రీ లోను బాగా పెరిగింది. ఇక పుష్ప సినిమా సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుందట.
ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర కూడా టూ పార్ట్స్ గా రిలీజ్ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్‌ను దేవర టీం గోప్యంగా ఉంచాలనుకున్నారట.. కాని పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరో సినిమా అనగానే ఆ సినిమా ఇన్ఫర్మేషన్ ఏదోలా లీక్ అవుతూనే ఉంటుంది. అలాగే దేవర సినిమా 2 పార్ట్స్‌గా రిలీజ్ చేస్తారంటూ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ సినిమాని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కథలో కంటెంట్ ఉంటే టు పార్ట్స్ గా రిలీజ్ చేసినా హిట్ కొట్టొచ్చు. అదే కథ వీక్‌గా ఉంటే ఎన్నిపార్టులుగా రిలీజ్ చేసినా.. లేదా ఒకే పార్టుగా రిలీజ్ చేసినా ఉపయోగం ఉండదని.. ప్రేక్షకులను మెప్పించదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.