టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఏ హీరోకు లేని అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నాడు.
టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో రిలీజ్ అయిన సినిమాలు ఇటీవల రీ రిలీజ్ చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన మరో సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ కేవలం 20 సంవత్సరాల వయసులో రాజమౌళి దర్శకత్వంలో నటించిన సింహాద్రి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
సింహాద్రి ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. ఆ రోజుల్లోనే ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూవీని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ హీరో రీ రిలీజ్‌కు దక్కని రికార్డ్ తారక్ సొంతం కాబోతోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఐమాక్స్ స్క్రీన్ పై సింహాద్రి సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ హీరో సినిమా రీ రిలీజ్ పరంగా మెల్‌బోర్న్‌లోని ఐమాక్స్ థియేటర్లో రాలేదు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సింహాద్రి సినిమా ప్రదర్శిస్తున్న విషయాన్ని మెల్‌బోర్న్ ఐమ్యాక్స్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. ఇక సింహాద్రి రీ రిలీజ్ లోను అదిరిపోయే రికార్డులు కొల్ల కొడుతుందని నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.