మహానటి సావిత్రి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న సావిత్రి ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, మురళీమోహన్, కృష్ణ లాంటి ఎందరో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి అంటే అలనాటి స్టార్ హీరోలు కూడా ఎంతగానో ఇష్టపడేవారు. సావిత్రి జీవిత చరిత్ర గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.
ఆమె జీవిత చరిత్రపై ఎన్నో పుస్తకాలు రావడమే కాక.. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ మహానటి పాత్రలో తెరకెక్కిన సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని ప్రతి సన్నివేశంలో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు నాగ్ అశ్విన్. ఆమె చివరి రోజులు తినడానికి తిండిలేనట్టుగా గడిచాయి.
ఎంతో గొప్ప నటి అయిన సావిత్రిని చివరి రోజుల్లో ఏఎన్నార్, ఎన్టీఆర్ ఆదుకోలేదా? కృష్ణ , మురళీమోహన్ వంటి వారంతా ఆమెకు ఎందుకు సహాయం చేయలేదు..? అంటూ అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ఈ తరం జనానికి తెలియని నిజం ఒకటి ఉంది. సావిత్రికి అందరూ ఏదో రకంగా సహాయం చేసేవారట.. కానీ ఇప్పటిలాగా అప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో ఈ వార్తలు బయటకు రాలేదు. అంతగా ప్రచారం చేసుకోవాలన్న ఉద్దేశం కూడా ఎవరికీ లేదు.
ఎన్టీఆర్, ఎన్నర్ ఇలాంటి వారంతా సావిత్రికి నెలా నెలా కొంత మొత్తం ఇంటికి పంపేవారట. అలాగే 1980 టైంలో సావిత్రి విజయవాడ అన్నపూర్ణ హోటల్లోనే నెలకు పది రోజులు బస చేసేవారట. అప్పటికే ఆమె ఆస్తి మొత్తం కోల్పోయి బంగారం, వజ్రాలు కుమార్తెకు ఇచ్చేశారు. అయితే అప్పట్లో జెమినీ గణేష్ సావిత్రిని వ్యక్తిగతంగా బాధ పెట్టడమే కాక ఆమె ఆస్తి మొత్తాన్ని లాగేసుకున్నాడంటూ ప్రచారం జరిగింది. సావిత్రి సున్నిత మనస్కురాలు కావడంతో మానసిక ఆటుపోట్లను భరించలేక చాలా ఇబ్బందులు పడింది. చివరి రోజుల్లో మద్యానికి బానిసై మరణించింది.