జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి సినిమాలో నటించిన పాయల్ ఘోష్ దాదాపు దశాబ్దంకు పైగా ఇండస్ట్రీలో కొనసాగింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలలో నటిస్తున్న ఆమెకు ఇప్పటివరకు సరైన గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఊసరవెల్లి కాకుండా ప్రయాణం, మిస్టర్ రాస్కెల్ సినిమాల్లో నటించిన పాయల్ తన 11వ సినిమా అనౌన్స్ చేసింది.
” ఫైర్ ఆఫ్ లవ్ రెడ్ ” సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రానున్నట్టు ప్రకటించింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది పాయల్. నేను కొందరితో బెడ్ రూమ్‌లోకి వెళ్లి బెడ్ … చేసుకొని ఉంటే నాకు ఇది 30వ సినిమా అయ్యేదని.. పెద్ద సినిమాలు రావాలంటే బెడ్రూంలోకి …. లేదంటే సినిమా ఛాన్సులు రావడం చాలా కష్టం.. అని వివరించింది.
దీంతో కొందరు సినీ అభిమానులు స్పందిస్తూ ఏమైంది? పాయల్ అంటూ.. ఎంత కష్టమైనా సరే నువ్వు నిజాయితీ గానే ఉండాలి అడ్డదారులు తొక్క వద్దు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కొంతసేపటికి పోస్ట్ డిలీట్ చేసింది పాయల్. కాగా మీటూ ఉద్యమం సమయంలో పాయల్ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.
ఆయన తనపై హత్యాచారానికి పాల్పడ్డాడని ట్విట్ చేసింది. ఇటీవల కూడా వరుస ట్వీట్ లు చేసిన పాయల్.. దక్షిణాదిలో తనకు ఎప్పుడూ అలాంటి అనుభవాలు ఎదురవలేదని.. బాలీవుడ్ లో మాత్రం అనురాగ్ తనను అత్యా.. చేశాడని వెల్లడించింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు బీ టౌన్‌తో పాటు నేషనల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.