టాలీవుడ్‌లో ఇటీవల మల్టీస్టారర్ కాంబినేషన్లలో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు , మిడిల్ రేంజ్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందు విక్టరీ వెంకటేష్ రామ్, పవన్, మహేష్‌బాబు లాంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. వెంకీ చింతకాయల రవి సినిమాలో ఎన్టీఆర్ స్టెప్పులు వేశాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించడం పెద్ద సెన్షేషనల్.
ఇక ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యలో రవితేజ, చిరు కలిసి నటించారు. బాలయ్య వీరసింహారెడ్డిలో నవీన్‌చంద్ర కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇక చిన్నా చితకా హీరోలు కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్పై సినిమాలో నిఖిల్ హీరో అయినా రానా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఇంట్రస్టింగ్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యే దశలో ఉంది.
దర్శకుడు వెంకీ కుడుముల ‘ఛలో ‘భీష్మ సినిమాలతో రెండు బ్లాక్బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల రష్మిక, నితిన్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో ఇంట్రస్టింగ్ రోల్ ఉందట. ఇందులో ఓ సీనియర్ హీరో నటిస్తే బాగుంటుందని.. ఆ పాత్ర బాగా పండడంతో పాటు సినిమాకు హెల్ఫ్ అవుతుందనే దర్శకుడు భావిస్తున్నాడట.
ఈ క్రమంలోనే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరును ఈ మల్టీస్టారర్‌కు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకీ కూడా ఈ ప్రాజెక్టులోకి యాడ్ అయితే తెలుగులో ఈ సినిమాకు మరింత మార్కెట్ పెరుగుతుంది. అటు నార్త్‌లో కూడా కొంత వరకు హెల్ఫ్ అవుతుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతోంది.