నన్ను రెండో పెళ్లి చేసుకోమంటూ నిత్యామీన‌న్‌ను న‌లిపేసిన ఆ స్టార్ హీరో…!

” అలా మొదలైంది ” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిత్యమీనన్. నాని సరసన హీరోయిన్గా నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిత్యమీనన్ ఎక్కువగా గ్లామర్ న‌టించ‌కుండా సాంప్రదాయ పాత్రల‌లోనే నటిస్తూ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

నితిన్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ లాంటి స్టార్ హీరోల‌ సరసన నటించిన నిత్యమీనన్ అందం, అభినయంతో తన సత్తా చాటుతుంది. అయితే నిత్యామీనన్ ను గ‌తంలో స్టార్ ఓ హీరో తెగ ఇబ్బంది పెట్టాడంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యమీనన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ స్టార్ హీరో గురించి చెప్పమంటే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దుల్కర్ సల్మాన్ నిజంగానే రెండో పెళ్లి చేసుకోమని మిమ్మల్ని అడిగాడా ? అని యాంకర్ ప్ర‌శ్నించ‌గా నిత్య అవును దుల్కర్ సల్మాన్ నన్ను ప్రతిసారి అలా అడిగేవాడు.. కానీ అదంతా.. మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తోనే.. న‌న్ను ఆట పట్టించడానికి అడిగేవాడు. మేం ఎప్పుడూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం.. దుల్కర్ ప్రతిసారి నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఆటపట్టిస్తుంటాడ‌ని తెలిపింది.

నాకు పెళ్లి వయసు రావడానికి సమయం పడుతుందనుకుంటే… నాకు వయసు వచ్చేలోగా మ‌రో వ్య‌క్తిని చూసి తొందరగా పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెట్టేవాడ‌ని నవ్వుతూ చెప్పింది. కానీ నేను మాత్రం నాకు పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.. టైం వస్తే చేసుకుంటాన‌ని త‌ప్పించుకునే దానిన‌ని చెప్పుకొచ్చింది నిత్య మీనన్. ఈ వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దుల్కర్ సల్మాన్ ఇలాంటి చిలిపి చేష్టలు కూడా చేసేవాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్.