ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈమె స్టార్ హీరోయిన్‌గా మారటానికి మరో అగ్ర హీరోయిన్ నిత్యామీనన్ ఈమెకు ఎంతో హెల్ప్ చేసిందట. అసలు ఈ విషయంలోకి వెళ్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. ఆ తర్వాత తన సొంత ఇండస్ట్రీలోనే హీరోయిన్‌గా మారింది. అదే సమయంలో యంగ్ హీరో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ర్వాత టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కీర్తి సురేష్ కు స్టార్‌డమ్ తెచ్చి పెట్టిన సినిమా మాత్రం మహానటి. ఈ సినిమా ఆలనాటి దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చలసాని అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ అయనా సావిత్రిగా కీర్తి సురేష్ నటించింది. మీగిలిన మూ ఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు వంటి అగ్ర నటులు నటించారు. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
అంతే కాకుండా ఎన్నో జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి లాగా జీవించి తన నటనతో ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయింది. ఇక ముందుగా ఈ సినిమా కోసం మొదటగా కీర్తి సురేష్ ని అనుకోలేదట. సావిత్రి పాత్ర కోసం మరో మలయాళ హీరోయిన్ నిత్య మీనన్‌ని ఎంపిక చేశారు ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పిందట. కానీ ఈ సినిమా స్టోరీ మొత్తం విన్నాక సినిమాలో మద్యం తాగే సీన్ ఉంటే తాను చేయనని స్క్రిప్ట్ లో మార్పులు చేయమని కోరిందట.
ఇక అందుకు ఈ సినిమా దర్శకుడు ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో నిత్యమీనన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కీర్తి సురేష్ కు అది ప్లస్ గా మారింది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఒకవేళ నిత్యమీనన్ మహానటి సినిమా చేసుంటే కీర్తి సురేష్ కెరీర్ ఇప్పటికే క్లోజ్ అయిపోయేది. కానీ నిత్యమీనన్ మహానటి సినిమా నుంచి తప్పుకుని కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్‌గా మారటానికి పరోక్షంగా హెల్ప్ చేసింది.