ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ట్ డం సంపాదించుకోవడం సాధారణమైన విషయం కాదు. అలాంటిది నిఖిల్ ఎలాంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిల్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాలో నిఖిల్ కీ రోల్లో నటించాడు. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇటీవలే రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్పై సినిమాలో నటిస్తున్న నిఖిల్ మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ సినిమాలో నటించడంతో నిఖిల్ చేసే ప్రతి సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న స్పై సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతోంది. స్పై టీజర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది. దీంతో ఈ సినిమా కూడా నిఖిల్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అక్కినేని బ్యాగ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ మనం సినిమాల్లో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించి మాయమవుతాడు.
ఆ తర్వాత హీరోగా నటించిన అఖిల్ సినిమా ఫ్లాప్. ఆ తర్వాత అఖిల్ చేసిన సినిమాలన్ని కూడా డిజాస్టర్ కావడంతో అఖిల్ ఒక్క హిట్ కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఇటీవల వచ్చిన ఏజెంట్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అఖిల్‌కు, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నిఖిల్ మధ్య కంపేరిజన్లు చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు అఖిల్ వేస్ట్… నిఖిలే ఎంతో బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అఖిల్ ఆ ఒక్క బంపర్ హిట్ ఎప్పటకి కొడతాడో ? చూడాలి.