టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ తరవాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా స్పై. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన స్పై సినిమా నిన్న ఎంతో గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. తొలి ఆట నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాతో నిఖిల్ మరో పాన్ ఇండియా హిట్ అందుకుంటారని అందరూ అనుకున్నారు. నిఖిల్ అభిమానులు సైతం కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అదేవిధంగా దర్శకుడు గ్యారి బిహెచ్ కథను ఎంతో బాగా రాసుకున్న.. డైరెక్షన్ విషయంలో ప్లాప్ అయ్యారు అంటూ నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ సినిమా ఎలాంటి ? కలెక్షన్లు రాబడుతుందా అంటూ నిఖిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు తీరా ఈ సినిమా టాక్ పరంగా ఎలా ? ఉన్నా కలెక్షన్ల పరంగా కొన్ని చోట్ల అదరగొట్టేసాడు నిఖిల్.
తొలి రోజున ఈ సినిమా మొత్తం గా రూ.6 కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టి ఎంతో బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్‌గా నిలిచింది. అయితే గ్రాస్ వసూళ్లు ఏకంగా రు. 11.7 కోట్లు కొల్లగొట్టినట్టు నిఖిల్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఇది నిఖిల్ రేంజ్‌కు చాలా ఎక్కువ. అసలు పాన్ ఇండియా లెవల్లో హిట్ టాక్ వచ్చిన కార్తీకేయ 2కే ఫస్ట్ డే రు. 8 కోట్లు రాబట్టింది.
అయితే ఇప్పుడు స్పై కు ఆ సినిమాతో పోలిస్తే చాలా ఎక్కువ వసూల్లు వచ్చాయి. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య కేంద్రాలైనహైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు వంటి ఏరియాలో కూడా స్పై బాగానే రాబట్టింది. దీంతో ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాగే మొత్తంగా నైజాంలో ఈ సినిమా రెండు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
మన తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్లు చేసిన నిఖిల్ స్పై సినిమా మిగత చోట్ల బొక్క బోర్లా పడిందనే చెప్పాలి. ఈ సినిమాకు హిట్ టాక్ రావాలంటే మరో రెండు రోజులు వచ్చే కలెక్షన్లే కీలకం. స్పై సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.17.5 కోట్లు చేసింది. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే వారంలోపు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.