ప్రస్తుతం ఇదే న్యూస్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో మెగా డాటర్ నిహారిక ఎలాంటి ?పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయింది. అంతకుముందే ఆమె బుల్లితెరపై తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఒక మనసు సినిమా తర్వాత కొన్ని సినిమాలలో నటించినా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.
దీంతో నిహారిక బుల్లితెరపై చాలా షోలు చేసింది. అటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలకు టాటా చెప్పేసి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయింది. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు వివాహం జరిగిన రెండేళ్లకే వీరిద్దరూ మనస్పర్ధలు నేపథ్యంలో విడిపోయారు.
రీసెంట్గా విడాకుల సైతం అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు నిహారిక అటు నిర్మాతగాను ఇటు వెబ్ సిరీస్లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఓ యంగ్ డైరెక్టర్ డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయినట్టు తెలుస్తోంది.
నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి రావడం మెగా ఫ్యామిలీకి ఏమాత్రం ఇష్టం లేదట. అయితే నిహారిక మాత్రం ఇంట్లో పెద్దలు చెప్పిన మాట ఏ మాత్రం లెక్క చేయటం లేదని.. విడాకుల విషయంలోనూ ఇదే జరిగిందని ఇప్పుడు మరోసారి ఆమె సినిమాల్లోకి వచ్చే విషయంలోనూ ఇంట్లో వాళ్ళ మాట పెడచెవిన పెట్టి తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతోందని తెలుస్తోంది.