ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించిన అతి తక్కువ సినిమాలే అయినా సక్సెస్ కాకపోవటంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టింది. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం నిహారిక తన భర్త చైతన్యతో దూరంగా ఉంటూ విడాకులకు రెడీగా ఉందని తెలుస్తుంది.
రీసెంట్ గానే నిహారిక అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగినా కూడా నిహారిక భర్త చైతన్య ఎక్కడ కనిపించలేదు. ఈ వేడుకలో కూడా నిహారిక సింగల్ గానే మెరిసింది. ఇక దీంతో ఈ మెగా డాటర్ విడాకులు కన్ఫామ్ అంటూ మెగా అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. అయితే విడాకులు తీసుకోబోతున్న ఆనందమో లేక తన ట్రెండ్ మార్చుకొందో తెలియదు కానీ నిహారిక ఎప్పుడైతే విడాకులు తీసుకుంటుంది అన్న వార్తలు బయటకు వచ్చాయో అప్పటినుంచి హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో తన గ్లామర్‌ను వలకబోస్తుంది.
ఇదే సమయంలో ఇన్నాళ్ళు ఎంతో పద్ధతిగా చీరలో ట్రెడిషనల్ గా కనిపించిన నిహరిక ఒక్కసారిగా అల్ట్రా మోడల్ బికినీ డ్రెస్ లో దర్శనం ఇచ్చి తన అంద చందాలను చూపిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ట్రెండీ లుక్ లో మెస్సి హెయిర్, టైట్ టాప్ లో ఘాటైన ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.
ఇక ఆ ఫోటోలకు మెగా అభిమానులు కూడా ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. చింపిరి జుట్టులో ఉన్న నిహారికను చూసి అచ్చం పిచ్చిదానిలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే మెగా కుటుంబం పరువు తీయటానికే ఇలాంటి పనులు చేస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.ఇక మరి నిహారిక ఈ కామెంట్లను ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి…!!