విడాకులు వ‌చ్చి వారం కాలేదు… మ‌రో పెళ్లికి రెడీ అయిన నిహారిక‌… !

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా రాణించారు. అయితే వీరిద్దరికీ మధ్య పుట్టిన నాగబాబు మాత్రం హీరోగా రాణించలేకపోయాడు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా తన ప్రతిభ కనబర్చారు. ఆయన కుమార్తె నిహారిక కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. ఆమె హీరోయిన్‌గానే కాకుండా నటిగా కూడా తన సత్తా చాటారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఇటీవల చాలా పరిణామాలు జరిగాయి.

ముఖ్యంగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నారు. 2020 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జొన్నలగడ్డ చైతన్యతో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పట్లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఫొటోలు, వీడియోలలో చైతన్యతో నిహారిక చాలా సంతోషంగా కనిపించింది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్యం సజావుగానే సాగింది. అయితే రెండేళ్ల తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.

2023 ఏప్రిల్ 1న వీరిద్దరూ పరస్పర అంగీకారంతో కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. తర్వాత జులై 5న వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే తన విడాకుల తర్వాత నిహారిక మరో పెళ్లికి సిద్ధం అవుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. పెళ్లి తర్వాత నిహారిక చాలా తక్కువగా నటించింది. అయితే నిర్మాతగా మారి యూట్యూబ్‌లో పలు వెబ్‌సిరీస్‌లకు నిర్మాతగా మారింది.

ఈ క్రమంలో ఓ యూట్యూబర్‌కి ఆమె సన్నిహితంగా మెలుగుతోందని, అందువల్లే ఆమె వైవాహిక జీవితంలో ఇబ్బందులొచ్చాయని టాక్ నడుస్తోంది. అతడినే ఆమె త్వరలో పెళ్లాడనుందని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ సాగుతోంది. వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారని అందువల్లే భర్తతో ఆమెకు గొడవలు వచ్చాయని సమాచారం. ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

నిహారిక తన భర్తతో విడాకులు అయితే తీసుకుంది. కాబట్టి ఆమె రెండో పెళ్లి చేసుకోవచ్చు. అందువల్లే ఆ యూట్యూబర్‌తో రెండో పెళ్లికి ఆమె సిద్ధం అవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే అన్నీ సిద్ధం అయ్యాయని, త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని ప్రచారం అయితే నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ నమ్మలేం.