విడాకుల‌ను నిహారిక ఎంత లైట్ తీస్కొందంటే.. సోష‌ల్ మీడియాలో ఏం చేసిందో చూడండి..!

జొమెగా డాటర్ నిహారిక ఈ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. నిహ‌రిక భర్త న్నలగడ్డ చైత‌న్యతో విడాకులు తీసుకుంటుందంటూ అనేక రకాల వార్తలు వినపడుతూనే ఉన్నాయి. వీరిద్దరు కూడా వారి ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒకరి ఫొటోస్ మరొకరు డిలీట్ చేయడంతో ఈ వార్తలు మరింత వేగంగా వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై వారిద్ద‌రు ఇప్ప‌టివ‌ర‌కు స్పందించలేదు.

తాజాగా నిహారిక – చైతన్య విడాకుల పత్రం సోషల్ మీడియాలో బ‌య‌ట‌కు రావ‌డంగతో ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు క్లారిటీ వచ్చేసింది. కూక‌ట్‌ప‌ల్లి ఫ్యామిలీ కోర్టు వీరికి అధికారికంగానే విడాకులు మంజూరు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా నిహారిక తన కెరియర్ పరంగా ముందుకు సాగడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంది.

అంతకుముందు నిహ‌రికా కొన్ని సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోయినా ఇటీవల కాలంలో సొంత బ్యానర్ పై పింక్ ఎలిఫెంట్ పిక్చర్ పేరుతో హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసింది. గ‌త‌ కొంతకాలంగా చైతుకు దూరంగా ఉన్న నిహారిక వెబ్ సిరీస్ లో నటిస్తూ గ్లామర్ షోలతో ప్రేక్షకులను అలరించింది. నిహారిక – చైతన్య విడాకుల విషయం మీడియా ద్వారా బయటికి వచ్చిన తర్వాత నిహారిక నోరు విప్పుతుందేమోనని అనుకున్నారు జనం.

కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోనట్లే తెలుస్తోంది. నిహారిక విడాకుల విషయంపై ఏమి స్పందించకపోగా ఈ వార్తలు వైరల్ అయిన కొద్దిసేపటికే అమెరికా నుంచి నిహారిక సినిమాలను ప్రమోట్ చేస్తున్న ఒక ఇన్ప్యుయెన్స‌ర్‌కి బర్త్‌డే విషెస్ తెలియజేసింది. నిహారిక విడాకుల పై రెస్పాండ్ కాకపోవడంతో ఆమె ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు నెటిజన్స్ భావిస్తున్నారు.