ప్రస్తుతం తెలుగు మీడియాలోనూ, తెలుగు సోషల్ మీడియాలోనూ.. వెబ్ మీడియాలను ఎక్కడ చూసినా మెగా డాటర్ తన భర్త చైతన్యకు విడాకులు ఇచ్చిన వార్త హాట్ టాపిక్‌గా నడుస్తోంది. గత ఏడాదికాలంగా నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంటుందా ? లేదా అసలు వీరిద్దరూ ఎందుకు ? దూరంగా ఉంటున్నారు.. నిహారిక భర్త చైతన్య వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కు ఎందుకు ? రాలేదు అలాగే నిహారిక అత్తింటి ఫ్యామిలీ కూడా ఎందుకు ? బయట కనిపించడం లేదు అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది ?అంటూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
అయితే ఈ వార్తలకు ఎట్టకేలకు చెక్ పెడుతూ నిహారిక – చైతన్య విడాకులు తీసుకున్నారు. ఇకపై వాళ్లు భార్యాభర్తలు కాదు.. వీరిద్దరి విడాకులకు సంబంధించిన పిటిషన్ బయటకు వచ్చింది. వీరిద్దరూ విడాకుల కోరుతూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసిన డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరు విడాకులు తీసుకుని నెల రోజులు దాటుతుందని కూడా అంటున్నారు.
ఇక నిహారిక భర్తతో మానసికంగా ఎప్పుడో దూరమైంది. ఆమె తిరిగి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి హాట్ హాట్ గా రెచ్చిపోతుంది. నిజమో అబద్దమో తెలియదు కానీ నిహారిక విడాకులు తీసుకోవడానికి టాలీవుడ్ లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ కారణం అంటూ ఇప్పుడు సరికొత్త వార్త బయటకు వచ్చింది. ఆమె ఎవరో కాదు సమంత. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత తన భర్త స్టార్ హీరో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కేవలం సమంత ఈ గ్లామర్ ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించేందుకే ఫ్యామిలీ బంధాన్ని తెంచుకుందన్న పుకార్లు అప్పట్లో బయటకు వచ్చాయి. ఇప్పుడు నిహారిక కూడా సమంతను స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్లామర్ ప్రపంచంలో తనకు నచ్చినట్టుగా తాను ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రస్తుతం నిహారిక నడుస్తున్న తీరు.. ఆమె బిహేవియర్ చూస్తుంటే ఆమె సినిమాల్లోనూ బుల్లితెర మీద రాణించాలని.. ఈ గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలగాలన్న కోరికతోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కారణమే ప్రధానంగా విడాకుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది.