విడాకుల‌పై నిహారిక పెట్టిన పోస్టులో ఈ మెలిక చూశారా!.. చైతు అంటే ఇష్టం అంటూనే..

మెగా డాటర్, టాలీవుడ్ ప్రముఖ నటి నిహారిక కొణిదెల గత కొన్నాళ్ల కితమే చైతన్య జొన్నలగడ్డ విడాకుల‌పై గ‌త ఆరేడు నెల‌లుగా తెలుగు మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ పుంకాను పుంకాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎట్ట‌కేల‌కు వీరిద్ద‌రు కూక‌ట్‌ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు ద‌ర‌ఖాస్తు చేసుకుని.. విడాకులు మంజూరు అయిన‌ట్టు నిన్న బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇప్పుడు ఇదే వార్త సోష‌ల్ మీడియాను షేక్ చేసి ప‌డేస్తోంది. తాజాగా ఈ రోజు నిహారిక త‌న‌విడాకుల‌పై ఇన్ స్టా వేదిక‌గా ఓ మెసేజ్ రూపంలో త‌న అభిప్రాయం చెప్పింది. తాను చైత‌న్య ఇష్ట పూర్వ‌కంగానే విడిపోతున్న‌ట్టు చెప్పింది. విడాకుల‌పై నిహారిక‌నే స్వ‌యంగా స్పందించ‌డం కూడా ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

త‌న మెసేజ్‌లో కూడా తాను చైతు ఇష్ట‌పూర్వ‌కంగానే అన్న మాట వాడ‌డంతో చైతును కూడా తాను గౌర‌విస్తున్న‌ట్టుగానే చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌య్యింది. ఇద్ద‌రి మ‌ధ్య కూడా కేవ‌లం నిహారిక సినిమాలు, ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచంలోనే కొన‌సాగే విష‌య‌మై చైతు, అత‌డి ఫ్యామిలీతో వ‌చ్చిన గొడ‌వ‌లే త‌ప్పా అంత‌కు మించి ఏం లేవ‌నే అంటున్నారు. అందుకే చైతుపై కూడా ఎక్క‌డా నెగ‌టివ్‌గా కామెంట్ అయితే చేయ‌లేదు.

ఇక ఈ స‌మ‌యంలో త‌న‌కు అండగా ఉన్న కుటుంబీకులు స్నేహితులకి అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాన‌ని.. అలాగే త‌మ‌కు కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాన‌ని తెలిపింది.