నిహారికకు రెండో పెళ్లి చేయాల‌న్నా నాగ‌బాబుకు భ‌యం ప‌ట్టుకుందా… షాకింగ్ రీజ‌న్‌…!

ఈ రీసెంట్ టైమ్స్ లో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. సమయంలో ఆయన ఏ సెలబ్రిటీ గురించి చెప్పినా అది నిజం అవుతుండ‌డంతో అయ‌న‌ చెప్పే జ్యోతిష్యం నమ్మే వారి సంఖ్య రోజుకిజుకి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా విడాకులు తీసుకున్న మెగా ఆడ‌ప‌డుచు నిహారిక గురించి కూడా వేణు స్వామి గతంలో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

వేణు స్వామి మాట్లాడుతూ నిహారిక రెండో పెళ్లి చేసుకున్నా ఆమె జీవితం సర్వనాశనం అయిపోతుందంటూ గ‌తంలో వేణు స్వామి చేసిన కామెంట్లను ఇప్పుడు కొంద‌రు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిహారిక- జొన్నలగడ్డ చైతన్య వివాహం పెద్దలు కుదిర్చినప్పటికీ పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నారు. వీరీ మధ్య ఎక్కడ చెడిందో కానీ పెళ్లయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.

వీరి విడాకుల విషయం ఇలా ఉంచితే నిహారిక విడాకుల సమయంలో వేణు స్వామి చేసిన కామెంట్లు మెగా ఫ్యామిలీలో సంచలనం సృష్టిస్తున్నాయి. నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుంది.. కానీ ఆమెకు పిల్లలు మాత్రం పుట్టరు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. రెండో పెళ్లి కూడా ఆమెకు ఏ మాత్రం క‌లిసి రాదంటూ ఆయ‌న క్లారిటీగా చెప్పేశారు.

వేణుస్వామి ఇప్పుడు నిహారికపై చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. పెళ్లి చేసుకున్నా కూడా మళ్లీ ఆమె జీవితంలో మొద‌టి పెళ్లి విషయంలో ఏం జరిగిందో ? అదే రిపీట్ అవుతుందంటూ కూడా అంటున్నారు. ఏదేమైనా వేణుస్వామి చేసిన కామెంట్లతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఆలోచనలోపడింద‌ని.. నాగ‌బాబు కూడా కాస్త ఆందోళ‌న‌లోనే ఉన్నాడ‌ని టాక్ ?