ఇండస్ట్రీలో నెక్స్ట్ విడాకులు తీసుకోబోతున్న జంట ఎవరంటే..? పేర్లు తో సహా చెప్పేసిన వేణు స్వామి..!!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈయన పేరు తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటల లిస్ట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా చాలామంది స్టార్ నటులు ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మనకు తెలిసిందే వేణు స్వామి స్టార్ సెలబ్రిటీస్ జీవితాలకు సంబంధించిన విషయాలను ముందుగానే చెప్తూ ఉంటారు. అలా వారి విషయాలను సోషల్ మీడియాలో ముందుగా చెప్పడం ద్వారా పాపులారిటి సంపాదించుకున్న వేణుస్వామి ..రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. మరోసారి సమంత‌, నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణాన్ని వివరించి .. ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో మరో స్టార్ హిరో హీరోయిన్ జంట కూడా విడాకులు తీసుకోబోతుందంటూ కామెంట్ చేశాడు.

శని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల నాగచైతన్య – సమంతల మధ్య మనస్ప‌ర్ధ‌లు వచ్చాయని.. ఈగోల కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నారంటూ చెప్పుకొచ్చిన వేణు స్వామి ..ప్రస్తుతం ఇదే ఉచ్చ స్థితిలో బాలీవుడ్ యాక్టర్స్ అభిషేక్ బ‌చ్చన్ – ఐశ్వర్య రాయ్ జాతకంలో జరుగుతుందని.. వీరు కూడా ఈగోల కారణంగా ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారని.. విడాకులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంటూ .. త్వరలోనే వీరు విడాకులు తీసుకుంటారంటూ వేణు స్వామి కుండ బద్దలు కొట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి.