ఒకప్పుడు సినిమాలు వస్తున్నాయి అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి సినిమాలు చూడడానికి వెళ్లేవారు. ఫ్యామిలీ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే రొమాంటిక్ సీన్లు ఎన్ని ఉన్నాయి.. హీరో హీరోయిన్లు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారు.. అనే మాటలు ప్రేక్షకుల్లో బాగా వినిపిస్తున్నాయి. ఇక సినిమా తీసేవారు కూడా అలాంటి కంటెంట్ తోనే ఎక్కువ సినిమాలను చేస్తున్నారు. అంతేకాకుండా రెమ్యూనిరేషన్ ఎక్కువగా వస్తుందని హీరోయిన్ల కూడా అలాంటి సన్నివేశాలు చేయడానికి ఒప్పుకుంటున్నారు.
ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి కూడా హీరో, హీరోయిన్లు పెద్దగా ఇబ్బందిపడటం లేదని తెలుస్తుంది. అయితే గతంలో ముద్దు సన్నివేశాల్లో ఖచ్చితంగా నటించాలంటే ఆ సినిమాలకు నో చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు.. కేవలం ఆ సినిమాలకు నో చెప్పడమే కాకుండా చిత్ర పరిశ్రమనే వదిలేశారు. అలా సినిమాలకు దూరంగా వెళ్లిన హీరోయిన్లు ఎవరు ఒకసారి చూద్దాం.
మాళవిక :
అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు, ఈ సినిమా టైంలో నటి కిరీటి గా పేరున్న రాజేంద్ర ప్రసాద్ తో చాల పెద్ద గొడవలే హరిగాయి మాళవికకి. అసలు ఆమె రాజేంద్ర ప్రసాద్ వల్లే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది అనే కామెంట్స్ కూడా వినబడ్డాయి. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ టైం లో ముద్దు పెట్టమని ఇబ్బంది పెడుతూ, తనతో అసభ్యంగా నడుచుకున్నాడని చాలా పెద్ద రచ్చ చేసింది మాళవిక. అప్పట్లో అయన పెద్ద హీరో ఆమె ఒక అప్ కమింగ్ హీరోయిన్ కావడంతో అందరు ఆమెనే తప్పు పట్టారు.
జరీనా ఖాన్ :
గోపీచంద్ హీరో గా నటించిన చాణక్య సినిమాలో జరీనా ఖాన్ హీరోయిన్ గా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడు వివాదాలతో బాలీవుడ్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒక బాలీవుడ్ సినిమా హీరో తనతో ముద్దు రిహార్సల్స్ చేయాలనీ బలవంతం పెట్టాడని చెప్పి బాంబు పేల్చింది జరీనా. సరిగ్గా చాణక్య సినిమా టైంలో చెప్పేసారికి అందరు గోపి చంద్ గురించి అంటూ పుకార్లు సృష్టించారు. అయితే తెలుగు హీరోలు మంచి వారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
మీరా చోప్రా :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది మీరా చోప్రా. తనను ఒక సినిమా షూటింగ్ లో ఒక హీరో బలవంతంగా ముద్దు పెట్టాలని అనుకున్నాడు..కానీ నేను కుదరదు అని చెప్పగానే మాట మార్చాడు అని అన్నది.. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక పబ్లిసిటీ పిచ్చి అని అందరు అనుకున్నప్పటికీ ఆమెను ఎవరో బెదిరించడంతోనే మాట మార్చింది అని ఆ తర్వాత తెలిసింది..మొత్తానికి ఆ ముద్దుగుమ్మ సినిమాలు చెయ్యడం మానేసింది .