శివజ్యోతి భ‌ర్త‌పై భారీ ట్రోలింగ్‌… ఆ చిన్న త‌ప్పు చేసి దొరికేశారుగా..!

యాంకర్ శివ జ్యోతి ఈ పేరుకి ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. ఈమె తీన్మార్ వార్తలతో సావిత్రిగా యాంకరింగ్‌ చేసి తెలంగాణ భాషలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని అభిమానులు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా అందులో తన కట్టు బొట్టు చూసి అందరూ ఫిదా అయిపోయారు. అలా తీన్మార్ సావిత్రి గా ఆమెకు క్రేజ్ రావడంతో బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది.

అయితే ఈ హౌస్ లో ఉన్నంతకాలం తన పాపులారిటీని మ‌రింతగా పెంచుకుంది. శివజ్యోతి బాగా ఎమోషనల్ అని బిగ్ బాస్ షోతో తెలిసిపోయింది. ఇక బిగ్‌బాస్ తర్వాత శివ జ్యోతి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది. ఇక బిగ్‌బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్లతో ఇప్పటికీ కూడా అదే ఫ్రెండ్షిప్ నీ కొనసాగిస్తుంది. వారితో కలిసి పార్టీస్, పబ్స్, షోలు అన్నిటికీ వెళ్తుంది. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత ఆమె లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.

ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న శివజ్యోతి బిగ్ బాస్ షో తర్వాత ఆమెలోని స‌రికొత్త‌ గ్లామర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. చాలా మోడ్రన్ గా తయారవుతూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఒకప్పుడు శివ జ్యోతి కట్టుబట్టు గురించి పొగిడిన జ‌నాలు… ఇప్పుడు మాత్రం ఆమెని చూడలేకపోతున్నా అని అంటున్నారు. శివ‌జ్యోతి తన భర్త గంగూలితో కలిసి చేసిన వీడియోలు, దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

వీరిది ప్రేమ వివాహం. అందుకే చూడడానికి ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరట. అలాగే యూట్యూబ్లో కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు అభిమానులకి టచ్ లోనే ఉంటుంది. ఆమె భర్త లేకుండా ఇక్కడికి వెళ్ళదు. తాజాగా ఆమె కొన్న బంగారాన్ని త‌న భ‌ర్త కొన్నాడ‌ని చెప్ప‌గా.. అత‌డు ఏ జాబ్ చేస్తాడ‌ని కొంద‌రు ప్ర‌శ్నించారు. ఆమె అలా చెప్ప‌డ‌మే వారు నెటిజ‌న్ల‌కు దొర‌క‌డానికి కార‌ణ‌మైంది.

భర్త పరువు పోకుండా కాపాడుకోవడానికి మాత్రమే ఆమె త‌న భ‌ర్త ఏదో ఒక జాబ్ చేస్తాడ‌ని చెపుతుంద‌ని కొంద‌రు కామెంట్ చేశారు. ఓ నెటిజ‌న్ అయితే శివ‌జ్యోతి భ‌ర్త ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు… తొందరపడి ఏదో ఒకటి చేస్తే ఆయనకు నచ్చదు అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో శివజ్యోతి ఫ్యాన్స్ ఆ నెటిజ‌న్‌పై మండిప‌డుతున్నారు.