సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ నయనతార, ఆమె భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు ఇప్పుడు కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. వీరిపై కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, లాల్ కుడి గ్రామానికి చెందిన విగ్నేష్ శివన్ తండ్రి పేరు శివ కొళుదు.. వీరు మొత్తం తొమ్మిది మంది అన్నదమ్ములు. శివ కొళుదు కొన్నేళ్ల క్రితం క్రితం మరణించారు. ఆయన ఉన్నప్పుడే అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిని అమ్ముకున్నారట.
దీనిపై ఇప్పుడు విగ్నేష్ శివన్ బాబాయిలు మాణిక్యం, కుంచిత పాదం సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తి మాకు తెలియకుండా అమ్ముకున్నందున విగ్నేశ్ కుటుంబం ఆ డబ్బులు కొన్న వ్యక్తికి ఇచ్చేసి.. ఆ ఆస్తి తమకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుచ్చి డీజీపీ ఆఫీస్ లో విగ్నేష్ బాబాయిలు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో వారు విగ్నేష్ శివన్, నయనతారలతో పాటు విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యల మీద కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇక కేసు నమోదు చేసుకున్న డీజేపీ విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈవార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నయన్, విఘ్నేష్ విషయానికి వస్తే ఏడేళ్ల పాటు డేటింగ్ చేసుకున్నవీరు 2022లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరు సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.
ఇక పెళ్లయ్యాక కూడా నయన్ సినిమాలలో నటిస్తోంది. అటు నయన్ భర్త డైరెక్టర్ విఘ్నేష్ సమంత, నయన్‌తో విజయ్‌సేతుపతి హీరోగా కేఆర్కే సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ కి జంటగా జవాన్ సినిమాలో నటిస్తున్నారు.