టీ, కాపీకి బెస్ట్ ఆల్ట‌ర్నేటివ్ ఈ నేచుర‌ల్ టీ.. దెబ్బ‌తో మైగ్రేన్‌, అసిడిటీ మటుమాయం..!

చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా ఉంటుంది. ఇది అసిడిటీకి కార‌ణ‌మ‌వుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక హెర్బల్ టీ తాగడం వల్ల అసిడిటి నివారించడంతోపాటు మైగ్రేన్, వికారం, తలనొప్పి, జిఈఆర్డి, పిసిఓఎస్, బ్లడ్ ప్రెషర్ మరియు హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుందట. దీక్ష బౌసర్ సవాలియా అనే ఆయుర్వేదిక్ గురు ఈ హెర్బల్ టీ విధానాన్ని వివరించాడు.

హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉదయాన్నే కాఫీ లేదా టీ తీసుకోవడం వల్ల అప్పటికే ఎర్ర పడిన గట్‌లో మంట వస్తుంది. ఇది ప్రేగుల్లో లైనింగ్‌ని చికాకుపెట్టడంతో పాటు హార్మోన్ల అస‌మ‌తుల్యతను, కడుపుబ్బరం, మలబద్ధకం, వేడి లాంటి సమస్యలను కలిగిస్తుంది. టీ లేదా కాఫీకి ప్రత్యామ్నాయంగా ఈ హెర్బల్ టీ ని తయారు చేసుకోవచ్చు అని తెలిపాడు.

హెర్బల్‌టీ తయారీ విధానం :
ఒక గ్లాసు నీటిలో 15 కరివేపాకు ఆకులు, 15 పుదీనా ఆకులు, ఒక స్పూన్ మెంతులు, కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని మీడియం ఉష్ణోగ్రతలో గిన్నెలో వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించిన తరువాత స్టవ్ నుంచి దించేసి ఒక క‌ప్పులో వడకట్టి ఆ పానీయాన్ని టీ లేదా కాఫీకి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. హార్మోన్ ప్రాబ్లమ్స్ వేడి సమస్యలు ఉన్నవారు కాఫీ, టీలకు దూరంగా ఉండటం చాలా మంచిదట.

ఈ వ్య‌స‌నం కాఫీతో రోజు ప్రారంభించే అలవాటును మానుకోవడం కష్టమవుతుంది. కాఫీ, టీ లకు ప్రత్యామ్నాయ పద్ధతి ఉంది. హెర్బల్ టీ లేదా కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలను తగ్గించవచ్చు. అల్లం టీ, చమోమిలే టీ, పెప్పర్మెంట్ టీ మరియు లెమన్ గ్రాస్ టీ లాంటి హెర్బల్ టీలు రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించి రాత్రులు బాగా నిద్ర పట్టడానికి సహకరిస్తాయి. ఇటువంటి హెర్బల్ టీలు రోజువారి టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా అలవాటు చేసుకోవడం మంచిది.

టీ లేదా కాఫీనే తాగాలంటే అందులో అర టీ స్పూన్ సేజ్‌ నెయ్యి లేదా ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె టీకి జోడించడం వల్ల జీర్ణాశయ వ్యవస్థకు హాని తగ్గుతుంది. పై ఇచ్చిన హెర్బల్ టీలు ఏవైనా తీసుకున్న 30 నిమిషాల తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవచ్చు. దాన్ని అనుసరించడం ద్వారా డైజెస్టివ్ సిస్టం రక్షించబడుతుంది. రోజువారి టీ కాఫీ అలవాటును తగ్గించుకొని హెర్బల్‌టీ అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది.