దుమ్ములేపిన ‘ ద‌స‌రా ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… నాని ఇదేం అరాచ‌కం సామీ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ద‌స‌రా. నాని కెరీర్‌లో ఏకంగా రు. 70 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా పై ముందు నుంచే భారీ అంచ‌నాలు ఉన్నాయి. నాని కెరీర్ లో ఫ‌స్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా ద‌స‌రా తెర‌కెక్కింది. అస‌లు రు. 70 కోట్ల బ‌డ్జెట్‌.. అందులోనూ నాని లాంటి హీరోకు అంత వ‌ర్క‌వుట్ అవుతుందా ? అన్న అనుమానాలు చాలానే ఉన్నాయి.

అయితే ఆ అనుమానాల‌ను ద‌స‌రా తొలి రోజే ప‌టాపంచ‌లు చేసి ప‌డేసింది. సినిమాకు యునాన‌మ‌స్ హిట్ టాక్ వ‌చ్చేసింది. ఇక తొలి రోజు శ్రీరామ న‌వ‌మి కూడా క‌లిసి రావ‌డంతో అదిరిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి. యూఎస్ లో అయితే ఈ సినిమాకు దిమ్మ‌తిరిగి పోయే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. నాని కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ప్రీమియ‌ర్ల తోనే ఈ సినిమా దుమ్ము రేపేయ‌గా.. తొలి రోజు కంప్లీట్ అయ్యే స‌రికి ఏకంగా 8 లక్షల 50 వేల డాలర్లు వ‌చ్చాయి.

ఇది నాని కెరీర్‌లో రికార్డు ఓపెనింగ్ గా నిలిచింది. అంటే రెండో రోజుకే 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను క్రాస్ చేసేయ‌నుంది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా… తెలంగాణ‌లోని సింగ‌రేణి బొగ్గు గ‌నులు, ఓ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Tags: film news, filmy updates, first day collection dasara, intresting news, latest viral news, nani movie, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news