ఆర్ఎక్స్ 100 లాంటి సూప‌ర్‌హిట్ సినిమా వ‌దులుకుని బాధ‌ప‌డ్డ స్టార్ హీరోయిన్‌…!

చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే కొన్ని కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. అలాంటి సినిమాలలో ఆర్ఎక్స్ 100 కూడా ఒకటి. ఈ సినిమాలో హీరో నుంచి దర్శకుడు వరకు అందరూ కొత్తవారే..! అయినా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా కంటెంట్. యంగ్ హీరో కార్తికేయ తొలిసారిగా హీరోగా న‌టించిన‌ ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. పంజాబీ బ్యూటీ పాయల్ రాజపుత్ హీరోయిన్‌గా నటించింది.

రావు రమేశ్, రాంకీ, లక్ష్మణ్ మీసాల త‌దిత‌రులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. 2018 జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. హీరోయిన్ పాయల్ రాజపుత్ తన తొలి సినిమాలోనే నెగిటివ్ షేడ్స్‌ ఉన్న బోల్డ్ రోల్లో అదరగొట్టేసింది గ్లామర్ షో తో పాటు తన నటన పరంగా కూడా విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంది.. యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా అందుకుంది.

ఇక్కడ చాలా మందికి తెలియని అసలు విషయం ఏమిటంటే… ఆర్ఎక్స్ 100 సినిమాకి హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ పాయల్ రాజపుత్ కాదట. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మరో నటి నందిత శ్వేతాను అనుకున్నారట. నందిత అప్పటికే టాలీవుడ్ లో నిఖిల్ కు జంటగా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సూపర్ హిట్ సినిమాలో నటించింది. కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే నందితను మేకర్స్ ఈ సినిమాలు నటించమని అడిగారట.

కానీ నందిత‌ హీరోయిన్ రోల్ చాలా బోల్డుగా ఉందని భావించి ఆర్ఎక్స్ 100 సినిమాను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమా విడుద‌లై సూపర్ హిట్ అవడంతో అనవసరంగా మంచి సినిమాను వదులుకున్నానని చాలా బాధపడిందట నందిత శ్వేత. ఇదే విషయాన్ని రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నందిత శ్వేత బయటపెట్టింది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.