నందమూరి నట వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కళ్యాణ్ రామ్. మొదట్లో నటుడుగా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇటీవల బింబిసారా సినిమాలో హీరోగా నటించి సూపర్ హిట్ కావడంతో మంచి క్రేజ్ సంపాదించుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఒకే రకమైన పాత్రలను కాకుండా వైవిధ్యమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలతో సక్సెస్ సాధించకపోయినా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.
ప్రస్తుతం నవీన్ మేడారం డైరెక్షన్లో ,’ డెవిల్ ‘ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కళ్యాణ్ రామ్ నటిస్తున సంగతి తెలిసిందే. ఇందులో కళ్యాణ్‌రామ్ స్పై పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఎంటీ? ఏ కధ ఆధారంగా సినిమాను తీస్తున్నారు? అనేది సీక్రెట్ గానే ఉంచారు మూవీ టీం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయింది. స్వతంత్రం రాకముందు మద్రాస్ ప్రెసిడెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరుగుతుందని.. అప్పటి గూడా చారి వ్యవస్థ ఎలా ఉండేది? ప్రభుత్వాలు పనితీరు ఎలా ఉంది? లాంటి అంశాలను బేస్ చేసుకుని సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తుంది.
ఈ స్టోరీ నిజాలకు చాలా దగ్గరగా ఉంటుందని కొన్ని వాస్తవ సంఘటనలు కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారని సమాచారం. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ పాత్రను పోషించబోతున్నాడు. ఓ రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో కళ్యాణ్ రామ్ చేసే స్టంట్స్, ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయని యూనిట్ నుంచి సమాచారం అందింది. స్పై సినిమాల్లోనే ఇదొక డిఫరెంట్ మూవీ గా ఉండబోతుందట.ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలింసిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. కళ్యాణ్ రామ్ తో ఈ సినిమా యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ సీన్స్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందట.