సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఘనత నందమూరి కుటుంబానికి సొంతం. సీనియర్ ఎన్టీఆర్ పలు సినిమాల్లో మూడు పాత్రల్లో నటించి మెప్పించడం గొప్ప విషయం. ఆయన పౌరాణికంలో అయినా, సాంఘీకంలో అయినా కూడా మూడు పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. అలాగే అధినాయకుడు సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు.
ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా బాలయ్య నటనకు మాత్రం ప్రేక్షకులు నుంచి మంచి గుర్తింపు దక్కింది. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ జై లవకుశ ‘ సినిమా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో మూడు పాత్రలో నటించి జనాల్ని మెప్పించాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యి రు. 80 కోట్లు రాబట్టింది.
జై లవకుశ సినిమాలో తారక్ ఒక పాత్రలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమా విడుదలై దాదాపు ఐదేళ్లు అవుతున్నా ఈ సినిమాలో తారక్ నటన ఎప్పటకీ మర్చిపోలేం. రావన్‌గా ఎన్టీఆర్ నట విశ్వరూపమే చూపించాడు. అలాగే హీరో కళ్యాణ్ రామ్ ‘ అమిగోస్ ‘ సినిమాలో మూడు పాత్రలు కనిపించాడు.
ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు సినిమాల్లో మూడు పాత్రల్లో.. అది కూడా వేరువేరు సినిమాల్లో నటించడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తారక్, కళ్యాణ్ రామ్ ఒకే సినిమాలో కలిసి నటించకపోయినా తారక్ హీరోగా తెరకెక్కిన సినిమాలకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నందమూరి హీరోలు కలెక్షన్ పరంగా కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నారు.