బాలయ్య ఫ‌స్ట్ ఇంట‌ర్వ్యూ చూస్తారా… ఆ ఆన్స‌ర్ మాత్రం హార్ట్ ట‌చ్చింగే..!

నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణణ తన తండ్రి పోలికలతో పాటు లక్షణాలు కూడా పుచ్చుకొని సినిమాలు చేస్తూ తెలుగులోనే స్టార్ హీరోగా ఎదగాడు. నట‌సింహం నుంచి గ్లోబల్ ల‌య‌న్ గా అభిమానుల మన్నలను పొందుతూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాల‌తో దూసుకు పోతున్నాడు. ఈ ద‌స‌రాకు భగవాంత్‌ కేస‌రీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

ఇలాంటివి నందమూరి బాలకృష్ణ హీరోగా మొదటి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యూస్ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో బాలయ్య ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. మరీ ముఖ్యంగా నటుడుగా నేర్చుకోవాల్సింది చాలా ఉందని.. ఎంతో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోవాలని ఉందని చెప్పుకొచ్చాడు బాలయ్య.

అంతేకాకుండా తన తండ్రి ఎన్టీఆర్ పోలికలు వచ్చినంత మాత్రాన అందరూ తన తండ్రి మాదిరిగానే చూడాల్సిన పనిలేదని.. తనలో కూడా ప్రత్యేక నటుడు ఉన్నాడని సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఏ పేపర్లో వచ్చింది అన్నది మాత్రం తెలియదు. ప్ర‌స్తుతం బాల‌య్య‌ తన ఫ్యామిలీతో అమెరికాలో జరిగే నాటా వేడుకల్లో పాల్గొంటూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ వెకేషన్ కంప్లిట్ చేసుకొని రాగానే భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బాబి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 109వ సినిమా చేస్తాడు. ఇలా బాలయ్య ఒకవైపు సినిమాలు మావైపు రాజకీయాల్లో రాణిస్తూ ఎంతో బిజీగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ప్రతీ సినిమా కూడా సక్సెస్ సాధించింది. ఈ క్ర‌మంలోనే భగవంత్ కేసరిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.