తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి నటసింహ బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలకృష్ణ ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ అయ్యేందుకు ఆయన సతీమణి వసుంధర పాత్ర కూడా ఎంతో ఉందట.
బాలయ్య ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం వెనక భార్య వసుంధర ఎంతో గొప్ప త్యాగం చేసిందని.. ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. వసుంధర నందమూరి ఇంటి కోడలు.. ఇటు స్టార్ హీరో బాలకృష్ణకు భార్య అయినా తనకంటూ మంచి గుర్తింపు కోసం అటు వ్యాపార రంగంలోకి వెళ్ళటం.. లేదా ఉద్యోగం చేయాలన్న కోరికతో ఉండేదట. అయితే పెళ్లి అయిన వెంటనే బ్రాహ్మణి పుట్టడంతో వసుంధర తన కోరికను చంపుకున్నారట.
ఆ తర్వాత వరుసగా తేజస్విని, మోక్షజ్ఞ పుట్టారు. ఈలోగా బాలయ్య స్టార్ హీరో అయిపోయారు. బాలయ్యకు ఏ విధమైన సమస్య లేకుండా ఇంటి బాధ్యతలు చెక్కబెట్టే క్రమంలో ఆమె తన వ్యక్తిగత కోరికలను కూడా పక్కన పెట్టేసారట. ఇలా ఇంటి బాధ్యతలను.. అటు భర్తను, పిల్లల బాధ్యతలను వసుంధర చూసుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టి ఇండస్ట్రీలో తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారు.
ఇలా వసుంధర తన భర్త విజయం కోసం.. తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తన కలల కోరికను పక్కనపెట్టి మంచి గృహిణిగా పరిమితమయ్యారని అంటూ ఉంటారు. ఏది ఏమైనా తమ అభిమాన హీరో కోసం వసుంధర చేసిన ఈ గొప్ప త్యాగంపై నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు వసుంధర గ్రేట్ అంటూ ఎప్పుడు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇలా భార్య వసుంధర భర్తకు మంచి సపోర్ట్ ఇవ్వటం వల్ల బాలకృష్ణ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా టాప్ హీరోగా కొనసాగుతున్నారని చెప్పాలి.