నమ్రతా శిరోద్క‌ర్‌ తండ్రి స్టార్‌ క్రికెటర్… తల్లి హీరోయిన్… వాళ్లిద్ద‌రు ఎవ‌రో తెలుసా..!

ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ కలిసిమెలిసి ఉన్న వాళ్లు కొంతమందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వంశీ’ సినిమాలో త‌న‌కు జతగా నటించిన మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్క‌ర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇన్నేళ్లు అవుతున్నా వీరు ఎలాంటి మనస్ప‌ర్థ‌లు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు.

పెళ్లి తర్వాత నమ్రత సినీ ఇండస్ట్రీకి దూరమయింది. వారి పిల్లల బాధ్యతలు చూసుకుంటూ పెద్దల్ని గౌరవిస్తూ గృహిణిగా మారింది. మొదట నమ్రతని కోడలు చేసుకోవడానికి సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. దానికి కారణం మహేష్ బాబుకి తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని కృష్ణ కోరికట. ఇక్కడి పద్ధతులు ఆచారాలు పాటించే అమ్మాయి త‌న ఇంటి కోడ‌లిగా వ‌స్తే బాగుంటుందని కృష్ణ అనుకున్నాడట.

కానీ మహేష్ బాబు నమ్రతని ప్రేమించడంతో పెళ్లికి ఒప్పుకోక తప్పలేదట. ఇదిలా ఉంటే నమ్రత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో ఇంట్ర‌స్టింగ్‌గా మారాయి. తన లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె 1977 జనవరి 22న ముంబైలో జన్మించింది. నమ్రత శిరోద్కర్ తండ్రి నిఖిల్ శిరోద్క‌ర్ క్రికెటర్ గా రాణించారు. ముంబై తరఫున ఆడి మంచి పేరు సంపాదించుకున్నారు.

నితిన్ శిరోద్క‌ర్ అద్భుతమైన బౌలర్. నమ్రత తల్లి కూడా సెలబ్రిటీ అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె కూడా న‌టి అయినా సినీ రంగంలో రాణించలేకపోయారు. నమ్రత కూడా మోడలింగ్ లో పేరు సంపాదించుకుంది.1993 లో మిస్ ఇండియా అయ్యారు. ఆ త‌ర్వాత మోడ‌లింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ అయ్యారు.