ఫైనల్లీ.. ఆ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లయ.. మొత్తానికి అనుకున్నది సాధించేసిందిరోయ్..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన లయ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో డాక్టర్‌ శ్రీ గణేష్ గోటి ని వివాహం చేసుకుంది. పెళ్ళి త‌ర్వాత‌ లయ సినిమాలకు దూరమయి కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయింది. లయకు ఒక కూతురు కూడా ఉంది. ప్రస్తుతం లయ సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తుంది. దీనికోసం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రీల్స్, ఫ‌న్నీ డైలాగ్స్ క్రియేట్ చేస్తూ ఇన్‌స్టాలో మరింత హంగామా చేస్తూ లయ మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగ‌ రీసెంట్‌గా యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ అభిమానులకు దగ్గరయింది. ఓ మంచి ఆఫర్ తో ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్‌ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందని తెలియడంతో ఆఫర్స్ కూడా ఇచ్చారట. అన్ని ఆఫర్స్ లో ఓ ఆఫర్ బాగా నచ్చిందని రీ ఎంట్రీకి అదే కరెక్ట్ ఛాయిస్ కావడంతో లయ ఆ సినిమాను చేయడానికి ఒప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా.

ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్‌చరణ్ హ్యాండీక్యాప్డ్ పర్సన్ గా కనిపించబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్‌ డ్రామాగా తెరకెక్కిబోతున్న ఈ సినిమాలో ల‌య‌ కీలకపాత్రను పోషిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న కారణం తో బుచ్చిబాబు లయని సెలెక్ట్ చేసుకున్నారని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్త నిజమో? కాదో? తెలియదు గాని దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు లయ ఫ్యాన్స్.