చేతి గోర్లు షేప్‌ని బట్టి వాళ్ల స్వభావాన్ని తెలుసుకోవచ్చు….అది ఎలాగో తెలుసా…!

చేతికి ఉండే గోళ్లలో గుండ్రని, చతురస్రం, గుండ్రని చతురస్రం, ఓవల్, బాదం ఆకారాలు కనిపిస్తాయి. తరచుగా మీ గోళ్ల ఆకారం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మీ ప్రత్యేక గుర్తుగా ఉండవచ్చు.

పొడవాటి గోర్లు: సహజంగా పొడవాటి ఆకారంలో ఉన్న గోర్లు స్వభావంతో చాలా ఆప్యాయంగా ఉంటాయి. అలాగే పొడవాటి గోర్లు ఉన్నవారు సృజనాత్మకంగా ఉంటారు. అలాగే నైపుణ్యంగా పని చెయ్యగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఇదే కాకుండా వారు చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు. కాబట్టి వీరు మంచి భాగస్వామి కావచ్చు.

వేలుగోళ్లు: గోర్లు పొట్టిగా, వెడల్పుగా ఉన్నవారు ఆరోగ్యంతో కలకల్లాడుతూ ఉంటారు. తెల్ల గోర్లు ఉన్నవారు తమ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. వారికున్న బలమైన చేతులు కారణంగా, వారు ఇతరులు కన్నా ఎక్కువ శరీరక శ్రమ చెయ్యగలుగుతారు.

చతురస్రాకార గోర్లు: గోర్లు చతురస్రాకారంలో ఉండే వ్యక్తులు కఠినమైన స్వభావం కలిగి ఉంటారు. వారు కొన్నిసార్లు ఇతరులతో అధికారంతో గర్వంతో మాట్లాడే శక్తి కలిగి ఉంటారు. వారు ఒక్క సమూహాన్ని నిర్మించడం, నడిపించడం పట్ల మక్కువ కలిగి ఉంటారు. కాబట్టి వారు టీం లీడర్లుగా బాగా పని చేస్తారు.

ఓవల్ ఆకారపు గోర్లు: మరి కొంతమందికి పొడవాటి గుండ్రని లేదా ఓవల్ అకారపు గోర్లు ఉంటాయి. అలాంటి గోర్లు ఉన్న వ్యక్తులు ఇతరులతో కలవడం, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం, పార్టీలు, పబ్, లాంటి వాటిలోకి అస్సలు వెళ్ళరు. అలాగే వారికి కుటుంబం పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాంటి మనుషులు వ్యాపారం చేయడం కంటే పనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

బాదం ఆకారపు గోర్లు: బాదం ఆకారపు గోర్లు చిట్కా వైపుగా ఉంటాయి. దీని కారణంగా వీరి గోర్లు బాదం పప్పు లాగా కనిపిస్తుంది. ఇలాంటి గోర్లు ఉన్నవారు ఇతరులతో బాగా కలిసి మెలిసి ఉంటారు. వీరు తన మనసు కంటే ఇతరుల మనసు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారితో ఫ్రెండ్షిప్ జీవితాంతం ఉంటుంది.